Pawan Kalyan: అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర

Pawan Kalyan: రోడ్ షోలలో పాల్గొననున్న జనసేనాని

Jyothi
Published on: 7 April 2024 11:55 AM IST
Pawan Kalyan Varahi Vijaya Yatra in Anakapalli
X

Pawan Kalyan: అనకాపల్లిలో పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర

Pawan Kalyan: ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్రలో భాగంగా ఇవాళ అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం 3.30 గంటలకు హెలికాప్టర్‌లో అనకాపల్లి డైట్‌ కళాశాల సమీపంలో గల ఒక ప్రైవేటు లేఅవుట్‌లో ఏర్పాటుచేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రింగ్‌రోడ్డులో గల ఎన్టీఆర్‌ విగ్రహం కూడలి, చేపలబజారు, చిన్న నాలుగురోడ్ల కూడలి, కన్యకాపరమేశ్వరి జంక్షన్‌, వేల్పుల వీధి మీదుగా నెహ్రూచౌక్‌ జంక్షన్‌ వరకూ వారాహి వాహనంలో రోడ్డుషో నిర్వహిస్తారు. నాలుగు గంటలకు నెహ్రూచౌక్‌ కూడలిలో వారాహి వాహనం మీద నుంచి ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించున్నారు.

అనకాపల్లిలో జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ పవన్ కల్యాణ్ తో ఈ యాత్ర కలిసి పాల్గొననున్నారు. అలాగే మిగతా కూటమి అభ్యర్థులను ఉద్దేశించి కూడా పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించున్నారు. ఈరోజు వారాహియాత్ర అనకాపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే జనసేనాని పర్యటన ఉంటుంది. రేపు ఎలమంచిలిలో పవన్‌ వారాహి విజయభేరి యాత్ర నిర్వహిస్తారు. ఎల్లుండి ఉగాది రోజున పిఠాపురంలో ఉగాది వేడుకల్లో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story