Pawan Kalyan: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ మా నినాదం..

Pawan Kalyan Unveil Jana Senas Future Plans
x

Pawan Kalyan: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ మా నినాదం..

Highlights

Pawan Kalyan: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ తమ నినాదమని అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.

Pawan Kalyan: వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ తమ నినాదమని అన్నారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఎట్టి పరిస్థితుల్లోను వైసీపీ అధికారంలోకి రాకూడదనేని తమ విధానమని, దానికి తగ్గట్టుగా తమ రాజకీయ వ్యూహం ఉంటుందని స్పష్టం చేశారు పవన్. జూనియర్‌ ఎన్టీఆర్‌, అమిత్‌షా ఎందుకు కలిశారో వాళ్లే చెప్పాలన్న పవన్ చంద్రబాబు, మోడీ కూడా కలిసి మాట్లాడుకున్నారని గుర్తుచేశారు. అంతటితో ఆగకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రస్తావన తీసుకొచ్చారు జనసేనాని తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్‌ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు కానీ, ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం.. అలాగే పార్టీలో మా వ్యూహాలు మాకుంటాయని తెలిపారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శతృవులు ఉండరని అన్నారు పవన్.

Show Full Article
Print Article
Next Story
More Stories