Pawan Kalyan Tweet: వైసీపీ గర్జన సభలపై పవన్‌కల్యాణ్‌ ట్వీట్

Pawan Kalyan Tweet: గర్జన సభలు దేనికి నిర్వహిస్తున్నారు

Jyothi
Updated on: 10 Oct 2022 11:41 AM IST
Pawan Kalyan Tweet on YCP Garjana Sabha
X

Pawan Kalyan Tweet: వైసీపీ గర్జన సభలపై పవన్‌కల్యాణ్‌ ట్వీట్

Pawan Kalyan Tweet: ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న విశాఖ గర్జన పేరుతో రాజకీయేతర JAC ర్యాలీ చేపట్టనుంది. దీనిపై తీవ్రంగా స్పందించిన పవన్.. దేనికీ గర్జనలు అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జగన్‌ను ఉద్దేశించి తాజాగా పలు ప్రశ్నలు సంధించారు. 'సంపూర్ణ మద్య నిషేధం' అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? 'మద్య నిషేధం' ద్వారా ఏటా 22 వేల కోట్లు సంపాదిస్తున్నందుకా? 151 మంది ఎమ్మెల్యేలు, 22మంది లోక్ సభ సభ్యులు, 9మంది రాజ్యసభ సభ్యుల బలంతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాల్సింది కాస్తా అప్పుల బాట పట్టించినందుకా? దేనికి గర్జనలు అంటూ పవన్ ట్వీట్ చేశారు.


Jyothi

Jyothi

Next Story