నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని టూర్

నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేనాని టూర్
x
Highlights

ఏపీ రైతులను నివర్ తుపాను దారుణంగా దెబ్బతీసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా అన్ని జిల్లాలపైనా నివర్ పంజా విసిరింది. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో...

ఏపీ రైతులను నివర్ తుపాను దారుణంగా దెబ్బతీసింది. ఉత్తరాంధ్ర జిల్లాలు మినహా అన్ని జిల్లాలపైనా నివర్ పంజా విసిరింది. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఆయన జిల్లాల వారీగా పర్యటిస్తారు. ఇవాళ కృష్ణా, గుంటూరు జిల్లాలో 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పవన్ పర్యటన సాగుతుంది. ఈ సందర్భంగా పవన్ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

ఇవాళ కృష్ణాజిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డలో పవన్ టూర్ కొనసాగుతుంది. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరులో పవన్ పర్యటిస్తారు. నివర్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట నష్టాలను స్వయంగా తెలుసుకోనున్నారు.

డిసెంబర్ 3న పవన్ కల్యాణ్‌ తిరుపతికి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో వరద వల్ల జరిగిన పంట నష్టంపై పార్టీ నాయకులతో చర్చిస్తారు. 4న శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలుస్తారు. అనంతరం నాయుడుపేట, గూడూరుల్లో పర్యటించి నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories