Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు జనసేనాని

Pawan Kalyan: వారాహియాత్రపై ముఖ్య నాయకులతో పవన్‌ సమావేశం

Jyothi
Published on: 1 Oct 2023 12:00 PM IST
Pawan Kalyan to Mangalagiri Party Office
X

Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు జనసేనాని

Pawan Kalyan: మంగళగిరి పార్టీ ఆఫీస్‌కు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేరుకున్నారు. పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఇక.. మధ్యాహ్నం ఒంటిగంటకు అవనిగడ్డకు బయల్దేరి వెళ్తారు పవన్. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ క్రీడా ప్రాంగణంలో బహిరంగ సభతో.. కృష్ణాజిల్లాలో 4వ విడత వారాహియాత్ర ప్రారంభం కానుంది. అవనిగడ్డ సభ అనంతరం.. జనసేనాని మచిలీపట్నం చేరుకుంటారు. రేపు, ఎల్లుండి వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

రేపు కృష్ణా జిల్లా జనసేన నాయకులతో పవన్‌ సమావేశమవుతారు. 3న జనవాణి కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆర్జీలను స్వీకరిస్తారు. 4న పెడన, 5న కైకలూరు నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారు. ఇదిలా ఉంటే.. టీడీపీ-జనసేన పొత్తు తర్వాత జరుగుతున్న యాత్ర కావడంతో.. ఈసారి వారాహియాత్రపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అటు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా వారాహియాత్రకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story