వైసీపీ సర్కారుకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 మత్స్యకారుల జీవితాలకు శాపంగా మారుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Arun Chilukuri
Published on: 20 Feb 2022 8:28 PM IST
Pawan Kalyan Strong Warning to YS Jagan govt
X

వైసీపీ సర్కారుకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 217 మత్స్యకారుల జీవితాలకు శాపంగా మారుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో జరిగిన మత్స్యకారుల భారీ నిరసన ప్రదర్శనలో పవన్ పాల్గొని ప్రసంగించారు. మత్స్యకారులు ఉత్పత్తి కులాలని, వారి దగ్గర ప్రభుత్వం అనుకున్న రేంజ్ లో డబ్బులుండవని, అలాంటివారిని జీవో 217 కిందికి తీసుకొచ్చి పన్నులు విధించడం అన్యాయమన్నారు. ఆ జీవోను వెనక్కి తీసుకోకపోతే పెద్దఎత్తున తిరుగుబాటు జరుగుతుందన్నారు. వైసీపీ పోకడలకు తాము భయపడటం లేదని, సహనంతో భరిస్తున్నామన్నారు పవన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story