సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఘాటు విమ‌ర్శలు.. మ‌రోసారి ఆ మాటంటే తానూ అనాల్సి వ‌స్తుంద‌ని హెచ్చరిక‌..

Pawan Kalyan: ఏపీలో అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Updated on: 23 April 2022 8:46 PM IST
Pawan Kalyan Strong Warning To YS Jagan And YSRCP Leaders
X

సీఎం జ‌గ‌న్‌పై ప‌వ‌న్ ఘాటు విమ‌ర్శలు..

Pawan Kalyan: ఏపీలో అధికార వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిప్పులు చెరిగారు. వైసీపీపై త‌న‌కు ఎలాంటి ద్వేషం లేద‌ని, వైసీపీ నేత‌లు ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌క‌పోతే మాత్రం త‌ప్పనిస‌రిగా నిల‌దీస్తాననీ స్పష్టం చేశారు. త‌న‌ను మ‌రోమారు ద‌త్తపుత్రుడు అని అంటే సీబీఐ ద‌త్తపుత్రుడు అని మిమ్మల్ని అనాల్సి వ‌స్తుంద‌ని జగన్ ను ఉద్దేశించి ప‌వ‌న్ అన్నారు.

త‌న‌కు సొంత వాళ్లు ఉన్నప్పుడు ఎవ‌రి వ‌ద్దకో ద‌త్తత వెళ్లాల్సిన అవ‌స‌రం లేద‌నీ ఆయన తేల్చిచెప్పారు. అయినా చంచ‌ల్ గూడ జైల్లో ష‌టిల్ ఆడుకున్న వాళ్లా నాకు చెప్పేది అంటూ జ‌గ‌న్ పేరును ప్రస్తావించ‌కుండానే ప‌వ‌న్ చురకలంటించారు. పశ్చిమ గోదావ‌రి జిల్లా చింతలపూడిలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు లక్ష ఆర్థిక సహాయాన్ని ప‌వ‌న్‌ అందజేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story