Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన.. కేరళకు చేరుకున్న జనసేనాని

Pawan Kalyan Starts Sanatana Dharma Tour
x

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన.. కేరళకు చేరుకున్న జనసేనాని

Highlights

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఆలయాలను సందర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన కేరళలోని కొచ్చి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. కొచ్చి ఎయిర్ పోర్టు నుంచి అగస్త్య మహర్షి ఆలయానికి బయలుదేరారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని 11 ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శిస్తారు. అనంత పద్మనాభస్వామి, మధుర మీనాక్షి, స్వామిమలై,తిరుతై సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాలను ఆయన సందర్శించుకుంటారు.ఆలయాల సందర్శన కోసం దీక్ష సమయంలో ధరించే దుస్తులను ధరించారు.సాధారణంగా ఆయన తెల్లటి దుస్తులు ధరిస్తారు.

పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న ప్రకారం ముక్కులను తీర్చుకునేందుకు ఈ పర్యటన చేపట్టారని చెబుతున్నారు. కానీ, దీనికి వెనుక రాజకీయ వ్యూహం ఉందనే ప్రచారం కూడా ఉంది. తిరుపతి లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని తెరమీదకి వచ్చిన సమయంలో ఆయన ప్రాయశ్చిత దీక్షను ప్రారంభించారు. ఆ సమయంలో ఆలయాను సందర్శించారు. విజయవాడ కనకదుర్గ ఆలయం నుంచి తిరుపతి వరకు ఆలయాలను ఆయన సందర్శించారు. తిరుపతిలో ఆయన దీక్షను విరమించారు.

మరో వైపు తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. ఇదే విషయమై టీటీడీ చైర్మన్ , అధికారులు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మంగళవారం జరిగిన చంద్రబాబు నిర్వహించిన మంత్రులు, అధికారుల సమావేశానికి పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. వెన్నునొప్పి కారణంగా ఈ సమావేశానికి ఆయన దూరంగా ఉన్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ చంద్రబాబుకు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories