ప్రభుత్వ వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిన వైసీపీ: కలెక్టర్ల సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: పాలన ఎలా ఉండకూడదో వైసీపీ పాలన తెలియజేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 5 Aug 2024 12:11 PM IST
Pawan Kalyan Speech at Collectors Conference
X

ప్రభుత్వ వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిన వైసీపీ: కలెక్టర్ల సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: పాలన ఎలా ఉండకూడదో వైసీపీ పాలన తెలియజేసిందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఐదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్నారు. కలెక్టర్ల సదస్సుకు హాజరైన ఆయన... గత ప్రభుత్వం వ్యవస్థలను ఆటబొమ్మలుగా మార్చిందని ఆరోపించారు. వ్యవస్థల్ని బలోపేతం చేయాలని ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్లకు సూచించారు.

పాలకులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా ముందడుగు వేస్తున్నాం. ఒకేరోజు రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ గ్రామసభలు నిర్వహిస్తున్నాం. పైలెట్ ప్రాజెక్టుగా మొదటగా పిఠాపురం నియోజకవర్గంలో చేపడతామని పవన్‌ అన్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story