భీమవరం జనవాణిలో జగన్‌ సర్కారుపై జనసేనాని ఆగ్రహం

Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 17 July 2022 6:21 PM IST
Pawan Kalyan Slams Jagan Govt
X

భీమవరం జనవాణిలో జగన్‌ సర్కారుపై జనసేనాని ఆగ్రహం

Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారు. మద్యనిషేధం విధిస్తామని హామీ ఇచ్చి ఆదాయ వనరుగా మార్చుకున్నారని మండిపడ్డారు. భీమవరంలో జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొన్న పవన్ బాధితుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. పట్టణంలో డంపింగ్ యార్డు సమస్యను స్థానికులు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒక సినిమా రిలీజ్‌ అవుతుందంటే.. కలెక్టర్‌ నుంచి ఆర్డీవో వరకు అందరినీ రంగంలోకి దించుతారు. కానీ, ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు వ్యవస్థలు ఎందుకు పనిచేయవని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story