వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు: పవన్

Arun Chilukuri
Published on: 6 March 2021 8:28 PM IST
వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు: పవన్
X

వైసీపీ దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారు: పవన్

వైసీపీ ప్రభుత్వంపై జనసేనాని పవన్ ఫైర్ అయ్యారు. బెదిరింపులు, దాడులు, రక్తపాతం ఇదే వైసీపీ తీరు అని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఎదురించే వ్యక్తులు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదన్న పవన్ అధికార పార్టీ దౌర్జన్యాన్ని ఎదురించేందుకు జనసైనికులు సిద్ధంగా ఉన్నారన్నారు. మార్పు కోసమే యువత ధైర్యంతో ఎన్నికల్లో పోటీ చేస్తోందని చెప్పారు. పన్నుల రూపంలో వచ్చిన సొమ్మును నచ్చిన పథకాల పేరుతో పంచుతున్నారని పవన్‌ ఆక్షేపించారు. అర్హులకు పింఛన్లు, పథకాలు ఆపడం అత్యంత దుర్మార్గమన్నారు. ప్రశ్నించకపోతే రాష్ట్రంలో దారుణాలు ఇలా కొనసాగుతూనే ఉంటాయని.. వైసీపీకి ఓటేస్తే ప్రజలను యాచకులుగా మారుస్తారని వ్యాఖ్యానించారు. పథకాలు తొలగిస్తామని బెదిరిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికార పార్టీకి లొంగకుండా ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story