
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఆసక్తికర కొటేషన్లు పోస్ట్
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన కొటేషన్లు పోస్ట్ చేశారు.
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో ఆసక్తికరమైన కొటేషన్లు పోస్ట్ చేశారు. ఆ కొటేషన్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ పోస్ట్ చేశారు. శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే" అంటూ కొటేషన్ ను ట్వీట్ చేశారు. బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిఫలించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వివరించారు.
అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పవన్ ఎందుకు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీ వైసీపీ ని ఉద్దేశించి ట్వీట్ చేశారా..? లేదా మిత్రపక్షంగా ఉంటూ ఆయన్ను వాడుకుంటున్న బీజేపీని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారా..? లేక గతంలో పొత్తు పెట్టుకొని తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు పొత్తులకు పిలుపు ఇచ్చిన చంద్రబాబు గురించి ఈ పోస్ట్ చేశారా అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చలు సైతం మొదలబెట్టారు.
The following quote by Writer'Sri Vakada Srinivas' reflects the RamManohar Lohia's thought process on the ascension of BC's & SC's into power.
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2022
"శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది..అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే..."

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire