Pawan Kalyan: ఏపీ ప్రభుత్వం రైతులను నమ్మించి మోసం చేసింది

* రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైంది * దళారులను మించిపోయి రైతులను రోడ్డుమీదకు తెస్తోంది ప్రభుత్వం

Sandeep Reddy
Published on: 22 July 2021 12:08 PM IST
Pawan Kalyan Says Andhra Pradesh Government Failed to Pay the Grain Money to Farmers | AP News Today
X

పవన్‌కల్యాణ్‌ (ఫోటో: ది హన్స్ ఇండియా)

Pawan Kalyan: ఏపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ నిప్పులు చెరిగారు. వైసీపీ సర్కార్‌ రైతులను నమ్మించి మోసం చేసిందన్నారు. రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్న పవన్‌.. దళారులను మించిపోయి రైతులను రోడ్డుమీదకు తెస్తోందన్నారు. ధాన్యం కొనుగోలు, బకాయిల విషయంలో గోప్యత ఎందుకని ప్రశ్నించారు. ధాన్యం డబ్బులు రాకపోతే వ్యవసాయ పనులు ఎలా మొదలుపెడతారన్న జనసేనాని. ఈ నెలాఖరులోగా రైతులకు డబ్బులు చెల్లించాలన్నారు. లేకపోతే రైతుల పక్షాన పోరాడతామని ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story