Pawan Kalyan Tweet: గంజాయిపై ట్విట్టర్‌లో స్పందించిన పవన్‌ కల్యాణ్‌

* గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్‌, గంజాయి వ్యాపారంపై నా యాత్రలో అనేక ఫిర్యాదులు వచ్చాయి -పవన్‌

Shilpa
Published on: 27 Oct 2021 9:58 AM IST
Pawan Kalyan Responds on Cannabis in Twitter
X

గంజాయిపై ట్విట్టర్‌లో స్పందించిన పవన్‌ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan Tweet: ఏపీ, ఒరిస్సా సరిహద్దులో గిరిజన గ్రామాల్లో గతంలో తాను చేసిన యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌ వేదికగా గుర్తు చేసుకున్నారు. తన పోరాట యాత్ర 2018లో రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలను అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందన్నారు. ఆంధ్రా ఒరిస్సా సరిహద్దు లోని గిరిజన ప్రాంతాలలో

ఆరోగ్యం, నిరుద్యోగం, అక్రమ మైనింగ్‌, గంజాయి వ్యాపారం అక్కడ మాఫియా గురించి తనకు అనేక ఫిర్యాదులు వచ్చాయని పవన్‌ ట్వీట్‌ చేశారు. అలాగే అక్కడ తన పర్యటనకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేశారు.


Shilpa

Shilpa

Next Story