Pawan Kalyan: కరోనా నుంచి కోలుకున్న పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Arun Chilukuri
Published on: 8 May 2021 4:59 PM IST
Pawan Kalyan Recovers From coronavirus
X

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఇమేజ్)

Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో తన వ్యవసాయక్షేత్రంలో క్వారంటైన్‌కు వెళ్లి, అక్కడే చికిత్స తీసుకున్నాడు. మూడు రోజుల క్రితం పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆరోగ్య ప‌రంగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని వైద్యులు తెలిపార‌ని అందులో పేర్కొన్నారు. త‌న ఆరోగ్యం బాగుప‌డాల‌ని పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేసిన జ‌న‌సైనికులు, అభిమానుల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపార‌ని వివరించారు.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story