Pawan Kalyan: టీమిండియా విజయం: దసరాకు ముందే ప్రతి భారతీయుడికి కానుక

Pawan Kalyan: టీమిండియా విజయం: దసరాకు ముందే ప్రతి భారతీయుడికి కానుక
x
Highlights

Pawan Kalyan: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి, తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఆసియా కప్ 2025 ఫైనల్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి, తొమ్మిదోసారి ఛాంపియన్‌గా నిలవడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ గెలుపు దేశ ప్రజలందరికీ ముందస్తు దసరా కానుక అని ఆయన అభివర్ణించారు. భారత జట్టుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, "కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ప్రదర్శించిన ప్రతిభ, నిలకడ ప్రశంసనీయం. జట్టు సమిష్టి కృషి, పట్టుదల, క్రీడాస్ఫూర్తికి ఈ గెలుపు నిదర్శనం. ఈ విజయం ప్రతి భారతీయుడి హృదయాన్ని గర్వంతో నింపింది" అని పేర్కొన్నారు. ఆసియా కప్‌లో భారత్‌కు ఇది తొమ్మిదో టైటిల్ కావడం విశేషం. ఈ గెలుపుతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు చేసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories