Pawan Kalyan - Fan Wedding Card: శుభలేఖపై దేవుడి ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ ఫోటో

Pawan Kalyan-Fan: పెళ్లి పత్రికలపై పవన్ చిత్రాన్ని ముద్రించిన శ్రీకాకుళం యువకుడు

Sandeep Reddy
Updated on: 17 Dec 2021 3:09 PM IST
Pawan kalyan Photo on Fan Wedding Card In  Srikakulam District
X

పెళ్లి పత్రికలపై పవన్ చిత్రాన్ని ముద్రించిన శ్రీకాకుళం యువకుడు(ఫైల్-ఫోటో)

Pawan Kalyan - Fan Wedding Card: తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు కోట్లలో వీరాభిమానులు ఉంటారు. వారి అభిమానం పలుసార్లు తారాస్థాయి చేరుతుంటుంది. రీసెంట్‌గా ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమాని చేసిన పని చూస్తే ఇది నిజ‌మ‌ని మ‌నం ఒప్పుకోక త‌ప్పదు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండ‌లం కేశ‌వ‌రావుపేట గ్రామానికి చెందిన త‌మ్మినేని శ్రీనివాస్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వీరాభిమాని. ఈ నెల 18న శ్రీనివాస్‌కు పెళ్లి కుదిరింది. త‌న జీవితంలో జ‌ర‌గుతున్న శుభకార్యంలో ఈ అభిమాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫొటోను ముద్రించుకున్నారు.

సాధార‌ణంగా పెళ్లి కార్డుల‌పై దేవ‌తా మూర్తుల బొమ్మల‌ను ప్రింట్ చేసుకుంటారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న‌కు దేవుడితో స‌మానం అని, అందుకనే ఆయ‌న ఫొటోల‌ను ముద్రించుకున్నాన‌ని అంటున్నారు త‌మ్మినేని శ్రీనివాస్‌. పవన్ కళ్యాణ్ అంటే తన కుటుంబానికి ఎంతో అభిమానమని, తన సోదరుడి పెళ్లి సమయంలోనూ శుభలేఖపై పవన్ ఫొటో ముద్రించామని శ్రీనివాస్ చెప్పడం విశేషం. మరోవైపు శ్రీనివాస్ తల్లిదండ్రులు, అన్న వదినలు కూడా పవన్ కళ్యాణ్ వీరాభిమానులే. అంతేకాదు, శ్రీనివాస్ అన్న అప్పలనాయుడు పెళ్లికి కూడా పవన్ కళ్యాణ్ ఫోటోను పెళ్లి కార్డులో ముద్రించినట్లు తెలిపారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story