Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌‌లో చంద్రబాబును కలిసిన పవన్‌, బాలకృష్ణ, లోకేష్‌

Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్‌ వద్దకు భారీగా జనసైనికులు, టీడీపీ కార్యకర్తలు

Jyothi
Published on: 14 Sept 2023 12:54 PM IST
Pawan Kalyan, Nandamuri Balakrishna, Nara Lokesh Meet Chandrababu Naidu in Rajahmundry Central Jail
X

Chandrababu Arrest: రాజమండ్రి సెంట్రల్‌ జైల్‌‌లో చంద్రబాబును కలిసిన పవన్‌, బాలకృష్ణ, లోకేష్‌

Chandrababu Arrest: చంద్రబాబుతో పవన్ కల్యాణ్, బాలకృష్ణ, లోకేష్ ములాఖత్ అయ్యారు. వీరితో పాటు నారా లోకేశ్ కూడా వెళ్లారు. సమావేశం సందర్భంగా చంద్రబాబుతో పవన్‌కల్యాణ్ కీలక విషయాలను చర్చించే అవకాశం ఉంది. మరోవైపు జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పవన్, బాలయ్య రాక నేపథ్యంలో అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్ కాలేజీ వద్ద వాహనాలను దారి మళ్లించారు. అనంతరం.. పవన్, బాలకృష్ణ మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే.. ములాఖత్ తర్వాత పవన్ ఏం మాట్లాడుతారనే దానిపై అటు టీడీపీ, ఇటు జనసేన కేడర్ తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.

Jyothi

Jyothi

Next Story