Pawan kalyan: కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుంది

Pawan Kalyan Met Bar Association Lawyers
x

Pawan kalyan: కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుంది

Highlights

Pawan kalyan: భూ కబ్జాదారులకు వరంగా మారనున్న ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు.

Pawan kalyan: భూ కబ్జాదారులకు వరంగా మారనున్న ఏపీ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా మంగళగిరి జనసేన కార్యాలయంలో న్యాయవాదులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లాయర్లు ఈ చట్టంపై పవన్‌కు వివరించారు. ఈ క్రమంలో జనసేనాని మాట్లాడారు. ఈ చట్టం అమల్లోకి వస్తే నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని, కబ్జాలకు పాల్పడే వారికి ఈ చట్టం చుట్టంగా మారుతుందన్నారు.

ఈ చట్టం అమల్లోకి వస్తే పేదలు భూములకు భద్రత ఉండదని పేర్కొన్నారు. పేదల భూములు అక్రమ రికార్డులతో ఆక్రమించే వారు... భూ కబ్జాదారులు పెరిగిపోతారని తెలిపారు. ఈ చట్టంతో ప్రజలకు మంచి జరుగుతుందని చెబుతూ.. ఏపీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సివిల్ కేసులు దాఖలు చేయడానికి వీలుండదని చెప్పారు. ప్రభుత్వం తక్షణం ఏపీ భూహక్కుల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి ఈ చట్టాన్ని రద్దు చేసేంతవరకు పోరాటాలు చేయాలని జనసేనాని పిలుపునిచ్చారు. న్యాయవాదుల ఆందోళనకు తన మద్దతు ఉంటుందని పవన్ ప్రకటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories