Pawan Kalyan: ఏపార్టీకి కొమ్ముకాయడానికి సిద్ధంగా లేను.. భవిష్యత్తులో శత్రువుతోనైన..

Pawan Kalyan: రాజకీయాల్లో ఏపార్టీకి కొమ్ముకాయడానికి సిద్ధంగా లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు.

Arun Chilukuri
Updated on: 21 Aug 2022 7:15 PM IST
Pawan Kalyan Interesting Comments on Alliance
X

Pawan Kalyan: ఏపార్టీకి కొమ్ముకాయడానికి సిద్ధంగా లేను.. భవిష్యత్తులో శత్రువుతోనైన..

Pawan Kalyan: రాజకీయాల్లో ఏపార్టీకి కొమ్ముకాయడానికి సిద్ధంగా లేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం తప్పనిసరిగా ఉండాల్సిందేనన్నారు. ప్రజారాజ్యం ఏర్పడినపుడు మార్పుకావాలని కోరుకున్న సమయంలో స్వార్థపరులవల్ల నిలదొక్కుకోలేక పోయామన్నారు. ప్రధాన మంత్రి మోడీ సూచనతోనే టీడీపీ మద్ధతు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కులమంటే పిచ్చిలేదని, భవిష్యత్తులో శత్రువుతోనైన పొత్తుపెట్టుకోవాల్సి వస్తుందన్నారు. ఏ సీఎంలకు తాను భయపడనని.. ఇక్కడే ఉంటానంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆదివారం తిరుపతిలో మాట్లాడిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఎవ్వరికీ భయపడనని తన ఆస్థులు లాక్కున్నా నిలబడతానని పవన్ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story