Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి.. జాతీయ మీడియాతో పవన్ చెప్పింది ఇదేనా?

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి

Arun Chilukuri
Updated on: 10 Jun 2024 11:12 AM IST
Pawan Kalyan Interested On Deputy CM Post
X

Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పదవిపై జనసేనాని ఆసక్తి.. జాతీయ మీడియాతో పవన్ చెప్పింది ఇదేనా?

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏర్పడబోయే ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషించనున్నారనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఎన్నికల్లో కూటమి విజయం సాధించగానే పవన్ డిప్యూటీ సీఎం అవుతారన్న చర్చ మొదలైంది. అయితే, ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. తాజాగా, ఈ విషయంలో పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చినట్టు జాతీయ చానల్ ‘ఇండియా టుడే’ పేర్కొంది.

ప్రధాని మోదీ, కేంద్రమంత్రుల ప్రమాణ స్వీకారానికి జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియా టుడే ఛానల్‌ రిపోర్టర్‌ పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడారు. రిపోర్టర్‌ ప్రశ్నలు, ఆయన సమాధానాలు కొంత అస్పష్టంగా వినిపించినా పవన్‌ ఏం మాట్లాడిందీ వినపడలేదు. ఆ ప్రశ్నల సందర్భంగా ఇండియా టుడే రిపోర్టర్‌ వ్యాఖ్యానిస్తూ పవన్‌ కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ ఛానల్‌లో ఈ విషయంపై స్క్రోలింగ్‌ ప్రసారం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నట్లు జనసేన అధినేత వెల్లడించారని అందులో పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story