logo

జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటి..? : పవన్‌కల్యాణ్

జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటి..? : పవన్‌కల్యాణ్
Highlights

కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం మా విధానం అన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఇంగ్లీష్‌ రాదంటూ డబ్బులు...

కుల, మతాలకు అతీతంగా రాజకీయాలు చేయడం మా విధానం అన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఇంగ్లీష్‌ రాదంటూ డబ్బులు సంపాదించకుండా ఉన్నారా అంటూ వైసీపీ నేతలను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. వ్యక్తిగత జీవితాలను వివాదంలోకి లాగడం ఎంత వరకు సమంజసమో చెప్పాలని ప్రశ్నించారు. తనను పవన్‌ నాయుడు అని ఎగతాళి చేసే వైసీపీ నాయకులు జగన్‌ రెడ్డి అని పిలిస్తే తప్పుపడుతున్నారన్నారు. తాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని జగన్ రెడ్డి అంటే వైసీపీ నేతలు తప్పుబట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ మీడియా అంతా ఆయనను అలాగే పిలుస్తుందనే విషయం వైసీపీ నేతలకు తెలియదా ? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.


లైవ్ టీవి


Share it
Top