Pawan Kalyan: నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Pawan Kalyan: నేటి నుంచి ఏప్రిల్ 12 వరకు వారాహి యాత్ర

Jyothi
Published on: 30 March 2024 7:16 AM IST
Pawan Kalyan Election Campaign from today
X

Pawan Kalyan: నేటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం

Pawan Kalyan: ఏపీలో పార్టీలన్నీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలయిన టీడీపీ, వైసీపీ పోటా పోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. ఈ ప్రచార మైదానంలోకి దిగడానికి జనసేన అధినేత పవన్ కూడా రెడీ అయ్యారు. తన ఎన్నికల ప్రచారాన్ని పిఠాపురంలో నేటి నుంచి ప్రారంభించనున్నారు. ఈ ప్రచార యాత్రకు ‘వారాహి విజయభేరి’ అని నామకరణం చేశారు. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ఈరోజు సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్‌లో ప్రారంభం కానుంది.

పిఠాపురం నుంచి ప్రారంభంకానున్న ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు జనసేన చీఫ్. పవన్‌ నిర్వహించబోతున్న ఎన్నికల ప్రచారం పిఠాపురంలో మూడు రోజుల పాటు సాగనుంది. ప్రచారంలో భాగంగా ఈరోజు పవన్ కల్యాణ్.. నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు. అనంతరం శ్రీపాద వల్లభుడి దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపు ఉప్పాడ సెంటర్‌లో బహిరంగ సభ నిర్వహిస్తారు. ఏప్రిల్ 1న పార్టీ చేరికలు పర్యవేక్షించి, నియోజకవర్గంలోని మేధావులతో సమావేశం కానున్నారు. ఈ మూడు ప్రచార రోజుల్లో పవన్ కల్యాణ్.. పిఠాపురంలోనే బస చేయనున్నారు. ఆ తర్వాత పవన్.. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు.

Jyothi

Jyothi

Next Story