వారి మరణం మాటలకు అందని విషాదం.. మృతి చెందిన అభిమానుల‌కు..

వారి మరణం మాటలకు అందని విషాదం.. మృతి చెందిన అభిమానుల‌కు..
x
Highlights

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్లగట్టలో కొందరు ఫ్యాన్స్ పవన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలింది. దీంతో ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని సోమశేఖర్‌, అరుణాచలం, రాజేంద్రగా గుర్తించారు.

విషయం తెలుసుకున్నపవన్ అభిమానుల మృతి ప‌ట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ప్రకటనను విడుదల చేశారు. దూరమైన బిడ్డలను తిరిగి తీసుకురాలేను కనుక వారి తల్లితండ్రులకు తానే ఒక బిడ్డగా నిలుస్తానని, వారి కుటుంబాలను ఆదుకుంటానని తెలిపారు. విద్యుత్‌ఘాతంతో మృతి చెందిన అభిమానుల‌కు ఒక్కొక్క‌రికీ రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక‌సాయం అందించాల‌ని పార్టీ కార్యాల‌య సిబ్బందిని ఆదేశించిన‌ట్లు ప‌వ‌న్ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. అలాగే చికిత్స పొందుతున్న హ‌రికృష్ణ‌, ప‌వ‌న్‌, సుబ్ర‌హ్మ‌ణ్యం, అరుణ్‌కు సరైన వైద్యం అందేలా చూడాల‌ని స్థానిక నాయకుల‌ను కోరిన‌ట్లు ప‌వ‌న్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories