Pawan Kalyan: విశాఖలో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. వాహనాలు ఒకదానికొకటి ఢీ!

Pawan Kalyan: విశాఖలో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. వాహనాలు ఒకదానికొకటి ఢీ!
x

Pawan Kalyan: విశాఖలో పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. వాహనాలు ఒకదానికొకటి ఢీ!

Highlights

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు విశాఖపట్నంలో స్వల్ప ప్రమాదం జరిగింది.

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు విశాఖపట్నంలో స్వల్ప ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నగరంలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే?

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్ వెళ్తున్న సమయంలో, ముందున్న ఓ వాహనం హఠాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న కాన్వాయ్‌లోని మరో వాహనం వేగాన్ని నియంత్రించలేక ముందున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రభావంతో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నట్లు సమాచారం.

ఊపిరి పీల్చుకున్న భద్రతా సిబ్బంది

ప్రమాదం జరిగిన సమయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆయనను పికప్ చేసుకోవడానికి వెళ్తున్న క్రమంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి. ఈ ఘటనలో భద్రతా సిబ్బందికి కానీ, ఇతరులకు కానీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories