Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను బుధవారం విరమించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 2 Oct 2024 12:12 PM IST
Pawan Kalyan Concludes Prayashchit Deeksha in Tirumala
X

Pawan Kalyan: ప్రాయశ్చిత దీక్షను విరమించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షను బుధవారం విరమించారు. ఇవాళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. వెంకన్నను దర్శించుకోవడానికి ముందే తన చిన్న కూతురు తరపున డిక్లరేషన్ పత్రాలపై ఆయన సంతకం చేశారు.

తిరుపతి లడ్డూ వివాదం వెలుగు చూసిన తర్వాత 11 రొజుల ప్రాయశ్చిత దీక్షను ప్రారంభించారు. మంగళవారం సాయంత్రం అలిపిరి నడక మార్గంలో పవన్ కళ్యాణ్ తిరుమలకు చేరుకున్నారు. రాత్రి అక్కడే బస చేశారు. ఇవాళ ఉదయం ఆయన బాలాజీని దర్శించుకున్నారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు పవన్ కళ్యాణ్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందించారు.

మూడు రోజుల పాటు తిరుపతిలో ఆయన పర్యటించనున్నారు. ఇవాళ రాత్రికి కూడా ఆయన తిరుమలలోనే ఉంటారు. గురువారం నాడు ఇదే జిల్లాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆయన తిరిగి అమరావతికి వెళ్తారు.

ALSO READ: Pawan Kalyan: తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చిన పవన్ కల్యాణ్ చిన్న కుమార్తె పలీనా అంజని

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story