Pawan Kalyan: తెలంగాణ ప్రజలకు వైకాపా క్షమాపణ చెప్పాలి

Pawan Kalyan: వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి

Dhatripriya
Updated on: 17 April 2023 10:41 AM IST
Pawan Kalyan Comments On YCP Party
X

Pawan Kalyan: హరీష్‌రావు ఏ సందర్భంలో అన్నారో తెలియదు.. కానీ ఏపీ మంత్రులు స్పందించిన తీరు సరికాదు 

Pawan Kalyan: వైసీపీ నేతలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను వైసీపీ మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఏపీ మంత్రులు స్పందించిన తీరు అభ్యంతర కరమన్నారు పవన్ కల్యాణ్. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హరీశ్‌రావు ఏ కంటెంట్‌లో అన్నారో తెలియదు కాని... ఏపీ మంత్రులు తెలంగాణ ప్రజలను ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. ఒక జాతిని అవమానిస్తుంటే సీనియర్లు ఏంచేస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. మంత్రులు తమ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఆయన కోరారు.

Dhatripriya

Dhatripriya

Next Story