వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : పవన్ కల్యాణ్

Arun Chilukuri
Published on: 28 Dec 2020 4:33 PM IST
వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం : పవన్ కల్యాణ్
X

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ ఘాటు వ్యా‌ఖ్యలు చేశారు. భయపెట్టి పరిపాలన చేయాలనుకుంటే ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరన్నారు. జనసేన ఎవరికీ భయపడదనే సంగతి జగన్ గుర్తుంచుకోవాలన్నారు. తాను సినిమాలు చేస్తూ రాజకీయాలు చేయకూడదంటూ వైసీపీ లీడర్లు విమర్శిస్తున్నారని, మరి, జగన్ వ్యాపారాలు చేస్తూ రాజకీయాలు చేయడం లేదా? అంటూ ప్రశ్నించారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 35వేలు చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేనని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తక్షణ సాయంగా ఎకరాకు పది వేల రూపాయల చొప్పున అందించాలన్నారు. రైతుల కోసం తాము రోడ్లపైకి వస్తే వైసీపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ లీడర్లు నోటికొచ్చినట్లు మాట్లాడితే తాము కూడా అదే పద్ధతిలో సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే శాసనసభ సమావేశాల్లోపు రైతులకు పరిహారం అందించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని పవన్ హెచ్చరించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story