Pawan Kalyan: జనవాణి లక్ష్యం.. సమస్యల్లో ఉన్నవారి బాధలు వినడం

Pawan Kalyan: జనవాణి లక్ష్యం.. సమస్యల్లో ఉన్నవారి బాధలు వినడం

Arun Chilukuri
Published on: 16 Oct 2022 11:56 AM IST
Pawan Kalyan Comments in Visakhapatnam
X

Pawan Kalyan: జనవాణి లక్ష్యం.. సమస్యల్లో ఉన్నవారి బాధలు వినడం

Pawan Kalyan: జనం సమస్యలను తెలుసుకోడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలనుకున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సమాధానం చెప్పాల్సిన అవసరంలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో ఎక్కడ జనవాణి నిర్వహించాలన్నా ఇబ్బంది రాలేదన్నారు. జనవాణి కార్యక్రమంలో వైసీపీ నాయకులకు పనేంటని ప్రశ్నించారు. జనవాణి అంటేనే జనం సమస్యలను తెలుసుకుని వెలుగులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్ధేశమన్నారు.

విశాఖ ఎయిర్ పోర్టులో ఉద్ధేశపూర్వకంగా వాళ్లమనుషుల చేతనే దాడిచేయించి వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని జనసేనాని అనుమానం వ్యక్తంచేశారు. జనసేన ర్యాలీకి అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నవారిపై దాడి చేశారని తప్పులు కేసులు బనాయించారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు, పోలీసుల వ్యవహారశైలిపై జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రజల సమస్యలను పరిష్కరిస్తే జనసేన పార్టీ జనవాణికెళ్లే పరిస్థితి ఉండదని పవన్ కళ్యాణ్‌ అన్నారు. పోలీసులంటే నమ్మకంలేని వ్యక్తి కింద పోలీసు వ్యవస్థ పనిచేస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తంచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story