Pawan Kalyan: తిరుపతి ఎస్పీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌ పై ఫిర్యాదు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు

Shekhar G
Updated on: 17 July 2023 1:28 PM IST
Pawan Kalyan At Tirupati SP Office
X

Pawan Kalyan: తిరుపతి ఎస్పీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై ఫిర్యాదు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ తిరుపతి చేరుకున్నారు. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై తిరుపతి జిల్లా ఎస్పీకి ఆయన ఫిర్యాదు చేశారు. తొలుత గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి తిరుపతికి వచ్చారు. జనసేన కార్యకర్తలతో కలిసి భారీగా ర్యాలీగా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని అక్కడ వినతిపత్రం అందజేశారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై సీఐ అంజూయాదవ్‌ చేయిచేసుకున్నారు. దీన్ని జనసైనికులు తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే పవన్‌ తిరుపతి చేరుకుని జిల్లా ఎస్పీని కలిసి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Shekhar G

Shekhar G

Next Story