డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేయనున్న జనసేనాని

Jyothi
Updated on: 1 Jun 2022 7:04 AM IST
Pawan Kalyan Asked DGP Appointment
X

డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలో ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కలువనున్నారు. ఏపీలో జనసేన శ్రేణులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారనే అంశాన్ని డీజీపీ దృష్టికి తీసుకు వెళ్లనున్నారు. ఇటీవల కోనసీమ అల్లర్ల కేసులో పలువురు జనసేన నేతల పేర్లను పోలీసులు ఛార్జిషీట్ లో ప్రకటించడంపై పవన్ కల్యాణ్ నేతృత్వంలోని బృందం డీజీపీతో చర్చించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది.

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ డీజీపీకి లేఖ రాశారు. రాష్ర్టంలో శాంతి భద్రతల పరిస్థితులను లేఖలో ప్రస్తావించారు. జనసేన శ్రేణులపై కేసులు, శాంతిభద్రతల అంశంపై చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు.

Jyothi

Jyothi

Next Story