Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకొస్తే అంధకారమే.. ముద్దుల మామయ్యను మళ్లీ గెలిపిస్తారా..

Pawan Kalyan: మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Arun Chilukuri
Updated on: 16 July 2022 9:01 PM IST
Pawan Kalyan Address in Janasena Kaulu Rythu Bharosa Sabha
X

Pawan Kalyan: వైసీపీ మళ్లీ అధికారంలోకొస్తే అంధకారమే.. ముద్దుల మామయ్యను మళ్లీ గెలిపిస్తారా..

Pawan Kalyan: మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తే ఏపీ అంధకారం అవుతుందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కోనసీమ జిల్లా మండపేటలో జనసేన రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఆయన పరామర్శించారు. 60 మంది కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థికసాయం అందించారు. అనంతరం పవన్ మాట్లాడుతూ కౌలు రైతులకు ప్రభుత్వం 7 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. ముద్దుల మామయ్యను మళ్లీ ఆదరిస్తారా? అంటూ సీఎం జగన్ ఉద్దేశించి సెటైర్లు వేశారు పవన్. జేబుల్లోంచి డబ్బులు ఇవ్వడం తమకేమీ సరదా కాదని పేర్కొన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇచ్చేందుకు సీఎం సిద్ధంగా లేరన్న పవన్ తప్పు జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకుంటే మనుగడ ఉండదని హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ తనకు ఆదర్శమని పవన్ కల్యాణ్‌ ప్రకటించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story