Papikondalu: ఈ రోజు నుంచి పాపికొండల బోటు షికారు ప్రారంభం

Papikondalu: పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి పాపికొండలకు టూరిజం బోట్లు...

Shireesha
Updated on: 7 Nov 2021 8:07 AM IST
Papikondalu Boat Services Starting from Today | AP Latest News
X

Papikondalu: ఈ రోజు నుంచి పాపికొండల బోటు షికారు ప్రారంభం

Papikondalu: ఈ రోజు నుంచి పాపికొండల బోటు షికారు ప్రారంభం. నిన్న అధికారులు ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు. పర్యాటకుల భద్రతకు భరోసా కల్పించే విధంగా నిర్వహించిన ఈ ట్రయిల్‌ రన్‌లో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజతో పాటు టూరిజం అధికారులు పాల్గొన్నారు. పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి పాపికొండలకు ట్రయిల్‌ రన్‌ నిర్వహించారు.

ఈ రోజు నుంచి పాపికొండలు వెళ్లేందుకు రెండు టూరిజం, తొమ్మిది ప్రైవేట్ బోట్లకు అనుమతి ఇచ్చారు అధికారులు. అలాగే.. ప్రతి టూరిస్ట్ బోట్‌కు పైలెట్ బోట్‌ను తప్పనిసరి చేశారు. కంట్రోల్ రూమ్ ద్వారా టూరిస్ట్ బోట్ల పర్యవేక్షణ జరగనుంది. పాపికొండల టిక్కెట్ రేటు ఒక్కో టూరిస్ట్ కు 750 రూపాయల నుంచి 12 వందల 50 కి పెంచినట్టు స్పష్టం చేశారు.

Shireesha

Shireesha

Next Story