Kadapa: వరద ఉధృతికి కూలిపోయిన పాపాగ్ని నది బ్రిడ్జి

*కడప జిల్లాలో కుండపోత వర్షం *కడప - తాడిపత్రి రహదారిపై నిలిచిన రాకపోకలు

Sandeep Reddy
Published on: 21 Nov 2021 8:39 AM IST
Papagni River Bridge Damaged Due to Heavy Floods in Kadapa District
X

వరద ఉధృతికి కూలిపోయిన పాపాగ్ని నది బ్రిడ్జి

Kadapa: కడప జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద ఉధృతికి కమలాపురంలోని పాపాగ్ని నది బ్రిడ్జి కొంతమేర కూలిపోయింది. కాగా నిన్న సాయంత్రమే బ్రిడ్జిపై రాకపోకలు ఆగిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. వెలిగల్లు డ్యాం గేట్లు ఎత్తడంతో పాపాగ్ని నదికి వరద ప్రవాహం ఎక్కువై బ్రిడ్జి పిల్లర్లు కుంగిపోయాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు కడప - తాడిపత్రి రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story