Pandula Ravindrababu Thanks Message To CM Jagan: సీఎం జగన్ కు పండుల రవీంద్రబాబు కృతజ్ఞతలు!

Pandula Ravindrababu Thanks Message To CM Jagan: సీఎం జగన్ కు పండుల రవీంద్రబాబు కృతజ్ఞతలు!
x
Highlights

Pandula Ravindrababu Thanks Message To CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు...

Pandula Ravindrababu Thanks Message To CM Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ఎంపీ పండుల రవీంద్ర బాబు పేరును నామినేట్ చేసారు. దీంతో పండుల సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయంపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్ సిపి నేత పండుల రవీంద్ర బాబు మాట్లాడుతూ.. రాజకీయాల్లో అనేక మంది మాట ఇస్తారు పలు హమీలు ఇస్తారు. కానీ అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కటి మరిచిపోతారు. మాట తప్పను మడం తిప్పను అని రాజకీయాల్లోకి వచ్చిన సీఎం జగన్ ఇచ్చిన హమీలు.. నవరత్నాలను ఏడాదిలోగా అమలు చేసి గ్రేట్ అనిపించుకున్నారు. గత ఎన్నికల‌ ప్రచారంలో భాగంగా అంబాజీపేట లో నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని సీఎం జగన్ నాకు ప్రామిస్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని నన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ గా సీఎం జగన్ నామినేట్ చేయడం ఆశ్చర్యం కు గురిచేసింది.

రాజకీయాల్లో ఇచ్చిన మాటను ఈ విధంగా నిలబెట్టుకుంటారా.. ఇది నిజమా అని నేను.. నా కుటుంబం నా స్నేహితులు షాక్ కు గురయ్యాం. సిఎం జగన్ గారు మీరు రియల్లీ గ్రేట్ సార్. దళిత, గిరిజన, బలహీలన వర్గాలకు ఒక అన్నగా మీరు నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళుతున్నారు. గత పదేళ్ళుగా మేము అనాధలుగా ఉన్నాం. మీరు వచ్చాక దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ఒక దిక్కు దొరికింది. పేద ప్రజలకు మీరు ఎంతో అవసరం. జీవితాంతం మేము మిమ్మల్ని గెలిపించుకుని మీకు అండగా నిలబడతాం. నన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు మీకు మన పార్టీకి కృతజ్ఞతలు అని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories