ముగిసిన తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు

ముగిసిన తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు
x

ముగిసిన తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు

Highlights

*ముగిసిన తొలివిడత నామినేషన్ల ఉపసంహరణ గడువు *మొదటి విడత ఏకగ్రీవాలపై క్లారిటీ వచ్చే అవకాశం *3,251 సర్పంచ్ స్థానాలకు 19,491 మంది నామినేషన్లు

ఏపీ పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో మోదటి విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో ఏకగ్రీవాలపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఏకగ్రీవాలపై ఇప్పటికే ఎస్ఈసీ పూర్తి ఫోకస్ పెట్టిన నేపథ్యంలో వైసీపీ ఆశించిన రీతిలో ఏకగ్రీవాలు నమోదు కాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మరోవైపు తొలివిడతలో 3వేల 251 సర్పంచ్ స్థానాలకు, 79 వేల 799 వార్డ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 వేల 251 సర్పంచ్ స్థానాలకు గానూ, 19 వేల 4వందల 91 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 32 వేల 5వందల 22 స్థానాలకు 79వేల 7వందల 99 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

ఇక మొదటి రోజు ఒక వెయ్యి 313 సర్పంచ్‌కు. 2 వేల 201 వార్డుమెంబర్లకు అభ్యర్తులు నామినేషన్లు దాఖలు చేశారు. రెండవ రోజు సర్పంచ్‌కు 7 వేల 462, వార్డు మెంబర్ 23వేల 342 మంది నామినేషన్లు వేశారు. చివరి రోజు భారీ ఎత్తున నామినేషన్లు దాఖలు అయ్యాయి. సర్పంచ్‌కు 10వేల 715, వార్డులకు 54వేల 256 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఏకగ్రీవాలపై కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


Show Full Article
Print Article
Next Story
More Stories