సీఎం వైఎస్ జగన్ సొంత అడ్డాకు నిమ్మగడ్డ.. రాజకీయ వర్గాల్లో చర్చ

సీఎం వైఎస్ జగన్ సొంత అడ్డాకు నిమ్మగడ్డ.. రాజకీయ వర్గాల్లో చర్చ
x

సీఎం వైఎస్ జగన్ సొంత అడ్డాకు నిమ్మగడ్డ.. రాజకీయ వర్గాల్లో చర్చ

Highlights

*సీమ జిల్లాల పర్యటనలో భాగంగా కడపకు రాక *జిల్లా అధికారులతో ఎన్నికలపై సమీక్ష *నిమ్మగడ్డ పర్యటనపై వైసీపీలో సమాలోచనలు *ప్రతిపక్షాల్లో మనోధైర్యాన్ని నింపడానికే వస్తున్నారా అంటూ అనుమానాలు

ఏకగ్రీవ ఎన్నికలపై ప్రతిపక్షాల అరోపణలతో ఈసీ సైతం అలర్టైనట్లే కనిపిస్తుంది. గత కొంత కాలంగా హట్ టాపిక్ గా మారిన రాష్ర్ట ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ రాయలసీమ జిల్లాల పర్యటన పేరుతో సిఎం జగన్ మోహాన్ రెడ్డి సొంత జిల్లాలో పర్యటించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయన పర్యటన అనంతరం జిల్లాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోనున్నాయన్న చర్చ ఇప్పుడు జిల్లాలో జోరందుకుంది.

నామినేషన్లు మొదలు ఎన్నికల్లోను ఏకగ్రీవాల పేరుతో ఇబ్బందులు సృష్టిస్తే చర్యలు తప్పవన్న హెచ్చరికలు ఇచ్చే క్రమంలోనే ఈ పర్యటనకు శ్రీకారం చుట్టారన్న ప్రచారం సాగుతొంది. ఎన్నికల్లో అధికార పార్టీ ఎలాంటి బెదిరింపులకు, దాడులకు పాల్పడిన ఇబ్బందులు తప్పవని ఇలాంటి విషయాల్లో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే అదికారులపైనా చర్యలు తప్పవన్న సంకేతాలు బలంగా ఇచ్చేందుకే నేరుగా జిల్లా పర్యటన ఉద్దేశ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతొంది. నిమ్మగడ్డ ఇప్పటికే అధికార పార్టీతో వైరం పెంచుకున్న నేపధ్యంలో ప్రతిపక్షాల్లో మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం సైతం చేస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories