ఫలించిన విజయసాయిరెడ్డి ప్రయత్నం.. ఆంధ్రా జాలర్ల విడుదలకు పాక్‌ అంగీకారం

ఫలించిన విజయసాయిరెడ్డి ప్రయత్నం.. ఆంధ్రా జాలర్ల విడుదలకు పాక్‌ అంగీకారం
x
విజయసాయిరెడ్డి
Highlights

ఎట్టకేలకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నం ఫలించింది.

ఎట్టకేలకు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నం ఫలించింది. పాకిస్థాన్ లో చిక్కుకున్న 20 మంది ఉత్తరాంధ్ర జాలర్లను విడిచిపెట్టేందుకు పాక్ ప్రభుత్వం అంగీకరించింది. పొట్టకూటి కోసం గుజరాత్‌ వలస వెళ్ళిన జాలర్లు 2018 డిసెంబర్‌లో పొరపాటున పాకిస్తాన్‌ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్‌ అరెస్ట్‌ చేసింది. అప్పటి నుంచి వారంతా పాకిస్తాన్‌ చెరలో ఉన్నారు. ఈ విషయం ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి వచ్చింది. దాంతో జాలర్లను విడిపించాలంటూ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్ర జాలర్లను విడిచిపెట్టాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి పలుమార్లు లేఖలు కూడా రాశారు.

ఈ క్రమంలో కేంద్ర విదేశాంగ శాఖ పాకిస్తాన్‌తో చర్చలు జరిపి ఆంధ్రా జాలర్లను విడిచిపెట్టాలని కోరింది. దీంతో ఆంధ్ర జాలర్లను విడిచి పెట్టేందుకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. మొత్తం 20 మంది మత్స్యకారుల విడుదలకు పాకిస్తాన్‌ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు విదేశాంగ శాఖకు సమాచారం అందింది. ఈ నెల 6న వాఘా సరిహద్దు వద్ద భారత్‌ అధికారులకు 20 మంది మత్స్యకారులను అప్పగిస్తామని పాకిస్తాన్‌ పేర్కొంది. ఈ మేరకు ఆ 20 మంది మత్స్యకారుల జాబితాను పాక్‌ ప్రభుత్వం.. భారత విదేశాంగ శాఖకు లేఖ ద్వారా పంపించింది.

వారి వివరాలు ఇలా ఉన్నాయి.

ఎం. గురువులు, తండ్రి సతియా,

♦ నక్కా అప్పన్న, తండ్రి లక్ష్మయ్య,

♦ నక్క నర్సింగ్, తండ్రి లక్ష్మణ్‌,

♦ వి. శామ్యూల్, తండ్రి కన్నాలు,

♦ కె.ఎర్రయ్య, తండ్రి లక్ష్మణరావు,

♦ డి. సురాయి నారాయణన్, తండ్రి అప్పలస్వామి,

♦ కందా మణి, తండ్రి అప్పారావు,

♦కోరాడ వెంకటేష్, తండ్రి నరసింహులు,

♦ శేరాడ కళ్యాణ్, తండ్రి అప్పారావు,

♦ కేశం రాజు, తండ్రి అమ్మోరు,

♦ భైరవుడు, తండ్రి కొర్లయ్య,

♦ సన్యాసిరావు, తండ్రి మీసేను,

♦ ఎస్‌.కిశోర్‌ , తండ్రి అప్పారావు,

♦ నికరందాస్‌ ధనరాజ్, తండ్రి అప్పన్న,

♦ గరమత్తి, తండ్రి రాముడు,

♦ ఎం. రాంబాబు, తండ్రి సన్యాసిరావు,

♦ సుమంత్‌ తండ్రి ప్రదీప్‌,

♦ఎస్‌. అప్పారావు, తండ్రి రాములు,

♦ జి. రామారావు, తండ్రి అప్పన్న,

♦ బాడి అప్పన్న, తండ్రి అప్పారావు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories