YS Sharmila: మా 48 గంటల డెడ్‌లైన్‌కు యాజమాన్యం దిగివచ్చింది

YS Sharmila: స్టీల్‌ప్లాంట్ కార్మికుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 3 Oct 2024 5:44 PM IST
Ownership came to our 48 hour deadline Says YS Sharmila
X

YS Sharmila: మా 48 గంటల డెడ్‌లైన్‌కు యాజమాన్యం దిగివచ్చింది

YS Sharmila: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో తొలగించిన 4 వేల 200 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తిరిగి విధుల్లోకి తీసుకోవడం కాంగ్రెస్ విజయమన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తాము పెట్టిన 48 గంటల గడువుకు దిగివచ్చి యాజమాన్యం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుందన్నారు. స్టీల్‌ప్లాంట్ కార్మికుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తరపును పోరాడిన స్ఫూర్తితోనే స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మెడలు వంచి ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకుందామని తెలిపారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story