హైదరాబాద్‎ ఫలక్‎నుమాలో గుడ్లగూబలు స్వాధీనం

హైదరాబాద్‎ ఫలక్‎నుమాలో గుడ్లగూబలు స్వాధీనం
x
Highlights

* బార్న్ గుడ్లగూబలకు అత్యంత డిమాండ్ * బార్న్ గుడ్లగూబలను క్షుద్రపూజల్లో వాడతారన్న అధికారులు * రూ.10 వేల నుంచి రూ.లక్ష పలుకుతున్న గుడ్లగూబల ధర * ఫారెస్ట్ విభాగానికి అప్పగించిన టాస్క్‎ఫోర్స్

హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలక్ నుమాలో చేసిన దాడుల్లో 15 బార్న్ గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్నారు. హృదయం ఆకారంలో ఉండే ఈ గుడ్లగూబలు 10 వేల నుంచి లక్షల వరకు ధర పలుకాతాయని పోలీసులు తెలిపారు. ఫలక నుమాలో ఫక్షులు విక్రయించే కమ్రాన్ అలీ నుంచి ఈ గుడ్లగూబలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన అధికారులు.. వీటిని ఫారెస్ట్ విభాగానికి అప్పగించినట్లు స్పష్టం చేశారు.

మరోవైపు.. గుడ్లగూబను చూస్తేనే గుండెలదిరిపోతాయి. అలాంటి గుడ్లగూబకు లక్షల్లో ఎందుకంత డిమాండో తెలిస్తేఆశ్చర్యం కలగక మానదు. చేతబడులు, క్షుద్రపూజల కోసం బార్న్ గుడ్లగూబలను వాడతారని తెలుస్తోంది. ఈ కాలంలో కూడా క్షుద్రపూజల కోసం మూగజీవాలను హింసించడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories