పొంగిన గోదావరి..శబరి

Sabari River: ఉదయబాస్కర్ కాలని, కూనవరం గ్రామాలను ముంచెత్తిన వరద నీరు

Shekhar G
Published on: 29 July 2023 10:29 AM IST
Overflowing Godavari And Sabari
X

పొంగిన గోదావరి..శబరి

Sabari River: అల్లూరి జిల్లా కూనవరం శబరి, గోదావరి సంగమం వద్ద వరద నీరు ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తోంది. 50 అడుగులు దాటి వరద నీరు ప్రహిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చింతూరు వద్ద శబరి నది 39 అడుగులకు చేరుకుంది. ఏజెన్సీలో సుమారుగా 2వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారులపై నుండి వరద నీరు ప్రవహిస్తుండటంతో... రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వీ.ఆర్.పురం మండలం వడ్డిగూడెం, శ్రీరామగిరి అడవివెంకన్న గూడెం, చింతరేవుపల్లి, జీడిగుప్ప పోచారం గ్రామాలను వరద నీరు ముంచెత్తింది. కూనవరం మండలం శబరికొత్తగూడెం, ఉదయబాస్కర్ కాలని, కూనవరం గ్రామాల్లో సైతం వరద నీరు చేరింది.

Shekhar G

Shekhar G

Next Story