ఏపీలోని ఈ ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు

ఏపీలోని ఈ ప్రాంతాలను టార్గెట్ చేసిన ఉగ్రవాదులు
x
Highlights

జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తరువాత రగిలిపోతున్న పాకిస్థాన్.. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. భారత్ లో విధ్వంసం...

జమ్మూకాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తరువాత రగిలిపోతున్న పాకిస్థాన్.. భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొలుపుతున్నట్టు నిఘా వర్గాలు పసిగట్టాయి. భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ సరిహద్దునుంచి 200 ఉగ్రవాదులు సిద్ధంగా ఉన్నట్టు అంచనా వేసింది. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చెయ్యాలని హెచ్చరించింది. శ్రీలంక మీదుగా ముష్కరులు ప్రవేశించే అవకాశముందని నిఘా వర్గాలు సమాచారం అందించాయి. దక్షిణాదిలో కోయంబత్తూరు, మధురై, ఏపీలోని ప్రఖ్యాత దేవస్థానం తిరుమల, అలాగే షార్ తదితర ప్రాంతాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసినట్లు నిఘావర్గాలు హెచ్చరించాయి.ఈ క్రమంలో తిరుమల, షార్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే కేంద్రానికి సమాచారం అందిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories