వైసీపీపై ముప్పేట దాడికి సిద్ధమవుతున్న విపక్షాలు

Andhra Pradesh: వైసీపీపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయ్.

Arun Chilukuri
Updated on: 3 May 2022 8:00 PM IST
Oppositions Preparing for a Thirtieth Attack on the YCP
X

Andhra Pradesh: వైసీపీపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయ్.

Andhra Pradesh: వైసీపీపై ముప్పేట దాడికి విపక్షాలు సిద్ధమవుతున్నాయ్. రేపటి నుండి జిల్లా యాత్రలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నారు. బాదుడే బాదుడు కార్యక్రమంతో జనాల్లోకి వెళ్లాలని టీడీపీ అధినేత నిర్ణయించారు. మరోవైపు 8న కర్నూల్ జిల్లాకు జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లనున్నారు. వైసీపీ పాలనపై దూకుడు పెంచేందుకు పర్ఫెక్ట్ స్కెచ్ తో టీడీపీ, జనసేన అడుగులేస్తున్నాయ్.

మంత్రివర్గ కూర్పు తర్వాత జగన్ సర్కారుపై దాడి పెంచాలని రెండు పార్టీలు నిర్ణయించాయ్. అందులో భాగంగా ప్రజల్లోనే తేల్చుకునేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నాయ్. ప్రభుత్వంపై ముప్పేటదాడి చేస్తున్నా వైసీపీ మౌనంగా ఉంటుందన్న భావనతో మరింత రెచ్చిపోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయ్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story