కోయకముందే కన్నీరు తెప్పిస్తున్న ఊల్లి

కోయకముందే కన్నీరు తెప్పిస్తున్న ఊల్లి
x
Highlights

ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. పెరుగుతున్న ధరలు చూసి జనం భయపడుతున్నారు. ధరలు రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కానరావడం లేదు. భారీ...

ఉల్లి కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తోంది. పెరుగుతున్న ధరలు చూసి జనం భయపడుతున్నారు. ధరలు రోజురోజుకు పెరగడమే తప్ప తగ్గే సూచనలు కానరావడం లేదు. భారీ వర్షాలకు పంట దెబ్బతినడంతో ఉల్లి రేట్ భగ్గుమంటోంది అని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద హోల్ సేల్ ఉల్లి మార్కెట్ అయిన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మార్కెట్ లో మేలు రకం ఉల్లి కిలో 45 రూపాయలు పలుకుతోంది. ఈ సీజన్ లో ఉల్లి కిలో 20 మించి పలకదు, దీనికి విరుద్ధంగా ఏకంగా మూడురెట్లుకుపైగా పెరిగింది. తాడేపల్లి గూడెం మార్కెట్ కు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా, ఆ తర్వాత కర్నూలు జిల్లా నుంచి ఉల్లి అమ్మకానికి వస్తోంది. కరోనా పరిస్థితులకు తోడు భారీ వర్షాలతో ఉల్లి పంట దెబ్బతింటుంది. పంట దిగుబడి తగ్గడంతో ఉల్లి రేట్ కు రెక్కలు వచ్చాయి.

తాడేపల్లి గూడెం మార్కెట్ లో ప్రస్తుతం కర్నూలు కొత్త రకం ఉల్లి క్వింటాల్ 3 వేల 5 వందలు, అదే మహారాష్ట్ర కొత్తరకం 4 వేల 2 వరకు పలుకుతోంది. కిరాణం షాపుల్లో ఉల్లి కిలో 50 నుంచి 60 వరకు అమ్ముతున్నారు. కరోనా నేపథ్యానికి తోడు భారీ వర్షాలకు పెద్దఎత్తున పంట దెబ్బతినడంతో ఉల్లి ధర పెరుగుదల కారణం అని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మహారాష‌్ట్ర నుంచి కొత్త రకం పంట వస్తేగాని ఉల్లి ధర తగ్గే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరలతో జనం బెంబేలు ఎత్తుతున్నారు. కిరాణం షాపుల్లో ఉల్లి వంక చూడాలనే బెదిరిపోతున్నారు. పెరుగుతున్న ఉల్లి ధరను ప్రభుత్వం నియంత్రించాలని, గతంలో మాదిరిగా రైతు బజార్లలో తక్కువ రేట్ కు అందించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories