Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

Balineni Srinivasa Reddy: ప్రతిపక్షాలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయి

Shekhar G
Published on: 15 Aug 2023 12:22 PM IST
Ongole Will Contest As A YCP Candidate In The Next Election Says Balineni Srinivasa Reddy
X

Balineni Srinivasa Reddy: వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా

Balineni Srinivasa Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానన్న బాలినేని.. ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి బరిలో ఉంటారన్నారు. తనపై వస్తున్న అసత్య ప్రచారాలను ఎవరు నమ్మవద్దన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు త్వర త్వరగా ముగిస్తుంటే... తాను మాత్రం ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరించడం వల్ల తాను నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం ఆలస్యం అవుతుందన్నారు. తాను చేపడుతున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆలస్యంపై సీఎం జగన్ అడిగారని... తాను మాత్రం ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్లి వారి సమస్యలు విని వాటిని అక్కడికక్కడే పరిష్కరించడంతో.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఆలస్యమవుతుందన్నారు.

Shekhar G

Shekhar G

Next Story