Magunta Sreenivasulu Reddy: టీడీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు..?

Magunta Sreenivasulu Reddy: వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని.. ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించనున్న మాగుంట శ్రీనివాసులు

Shekhar G
Published on: 11 March 2024 12:17 PM IST
Ongole MP Magunta Srinivasulu To TDP..?
X

Magunta Sreenivasulu Reddy: టీడీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు..?

Magunta Sreenivasulu Reddy: టీడీపీలో చేరేందుకు మాగుంట కుటుంబం సంసిద్ధంగా ఉందని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. టీడీపీ, జనసేన నాయకులు ఇవాళ ఉదయం మాగుంటతో భేటీ అయ్యారు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సూచనల మేరకు త్వరలోనే టీడీపీలో చేరతానని ఆయన స్పష్టం చేశారు. తనతో పాటు తన కుమారుడు రాఘవరెడ్డి, మాగుంట అభిమానులు టీడీపీలో చేరుతామని వెల్లడించారు.

33 ఏళ్లుగా రాజకీయాల్లో మాగుంట కుటుంబాన్ని ఆదరించారని.. రానున్న రోజుల్లో కూడా ఆదరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో తాను రాజకీయాలకు రిటైర్మెంట్ తీసుకుంటున్నానని... వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టేందుకు నిర్ణయించుకోవడం జరిగిందని ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

Shekhar G

Shekhar G

Next Story