ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. మున్నా గ్యాంగ్‌లో 12 మందికి ఉరి శిక్ష..

Ongole Court: హైవే కిల్లర్‌ మున్నా కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

Arun Chilukuri
Published on: 24 May 2021 3:07 PM IST
ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. మున్నా గ్యాంగ్‌లో 12 మందికి ఉరి శిక్ష..
X

ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. మున్నా గ్యాంగ్‌లో 12 మందికి ఉరి శిక్ష..

Ongole Court: హైవే కిల్లర్‌ మున్నా కేసులో ప్రకాశం జిల్లా ఒంగోలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రధాన నిందితుడు మున్నాతో పాటు మరో 12 మందికి ఉరిశిక్షను ఖరారు చేసింది. 13 ఏళ్ల క్రితం హైవేలపై లారీ డ్రైవర్లు, క్లీనర్లను హత్య చేసింది మున్నా గ్యాంగ్‌. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పును వెలువరించింది. జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేకెత్తించింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి 13మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది ఈ మున్నా గ్యాంగ్. ఐరన్ లోడ్‌తో వెళ్తున్న లారీలను టార్గెట్ చేసి డ్రైవర్, క్లీనర్లని చంపి లారీలు ఎత్తుకెళ్లేవారు. ఈ హత్య కేసుల్లో 18 మందిని నిందితులు‌గా కోర్టు నిర్ధారించింది. మరో ఆరుగురికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు ఇచ్చింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story