JC Prabhakar: ఉదయం ఆరుబయట స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ

JC Prabhakar: తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన

Sandeep Eggoju
Updated on: 3 Aug 2021 11:23 AM IST
Ongoing JC Prabhakar Reddy Strike in Tadipatri
X

ఆరుబయట స్నానం చేసి నిరసన తెలిపిన జేసీ ప్రభాకర్

JC Prabhakar: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి నిరసన రెండో రోజు కొనసాగుతోంది. రాత్రి తన అనుచరులతో అక్కడే నిద్రించిన జేసీ.. ఉదయం ఆరుబయటే ముఖం కడుక్కొని, స్నానం చేసి నిరసన తెలియజేశారు. నిన్న 11 గంటలకు మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించాలని నిర్ణయించిన జేసీ.. కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడ అధికారులు ఎవరూ లేరు. దీంతో సాయంత్రం వరకు అక్కడే వేచి ఉన్నారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. మూడ్రోజుల ముందే సమాచారం ఇచ్చినప్పటికీ అధికారులు, సిబ్బంది హాజరుకాకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు జేసీ.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story