Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Srisailam Reservoir: 2 గేట్లు ద్వారా దిగువకు నీరు విడుదల

Sriveni Erugu
Published on: 24 July 2022 12:11 PM IST
Ongoing flooding of Srisailam Reservoir
X

Srisailam: శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద

Srisailam Reservoir: శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. జలాశయంలోని 12 క్రస్ట్ గేట్లలో 2 గేట్లు 10 అడుగులు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో లక్షా 9వేల 765 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 53 వేల 580 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 201.19 టీఎంసీలుగా చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 882.20 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story