Visakhapatnam: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి

Visakhapatnam: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విశాఖపట్నం విలవిలలాడింది.

Arun Chilukuri
Published on: 7 May 2021 12:28 PM IST
One Year for Visakhapatnam LG Polymers Fire Accident
X

Visakhapatnam: విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు ఏడాది పూర్తి

Visakhapatnam: సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున విశాఖపట్నం విలవిలలాడింది. తెల్లవారక ముందే విషవాయువు 12మంది ఊపిరి తీసింది. వేలాది మందిని అచేతనంగా మార్చేసింది. విశాఖలోని వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో స్టైరీన్ గ్యాస్ గత ఏడాది మే 7న లీకైంది. ఆ గ్యాస్‌ పీల్చిన వారంత కుప్పకూలిపోయారు. ప్రజలంతా ప్రాణాలు అరచేత పట్టుకుని దూరంగా పారిపోయేందుకు పరుగులు తీశారు. ఆ దుర్ఘటన స్థానికుల జీవితాల్లో పీడకలగా మిగిలిపోయింది. ఆ భయనక దృశ్యాలు తలుచుకుంటే స్థానికులు ఇప్పటికీ ఉలిక్కిపడుతున్నారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన మానని గాయంగానే బాధితులను వేధిస్తోంది. భారీ స్థాయిలో ప్రమాదం జరిగినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story